సమ్మర్లో బయటనుంచి ఎంత హైడ్రేటెడ్‌గా ఉన్నా లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. నిమ్మకాయరసంలో నీటిని వేసుకుని.. సాల్ట్, షుగర్ లేకుండా ఉదయాన్నే తాగాలి. సమ్మర్ సీజన్లో మధ్యాహ్నం కొబ్బరి నీళ్లు తాగడానికి ట్రై చేయండి. సబ్జా నీళ్లు రెగ్యూలర్‌గా తీసుకుంటే హైడ్రేషన్‌తో పాటు, ఆరోగ్యానికి ప్రయోజనాలు అందుతాయి. చెమట ఎక్కువ పట్టేస్తాది కాబట్టి మార్నింగ్ మాయిశ్చరైజర్ జెల్, సన్‌స్క్రీన్ అప్లై చేయండి. టైట్, సింథటిక్ క్లాత్స్ వేసుకోకపోవడమే మంచిది. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. చెమట ఎక్కువగా పడుతుంటే డస్టింగ్ పౌడర్‌ను కచ్చితంగా ఉపయోగించండి. సన్‌గ్లాసెస్, హ్యాట్ పెట్టుకుంటే స్కిన్ డ్యామేజ్ తగ్గుతుంది. (Images Source : Unsplash)