అన్నం వండేప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దట

అన్నం లేకుండా ఏ మీల్​ కూడా కంప్లీట్ కాదు. అలాంటి రైస్​ని వండేప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకూడదు.

అన్నాన్ని వండేముందు బియ్యాన్ని రెండూ లేదా మూడు సార్లు కడగాలి.

ఇలా కడగకుంటే రైస్ పొడిపొడిగా కాకుండా.. జిడ్డుగా అతుక్కుపోతుంది.

వైట్ రైస్, బ్రౌన్ రైస్​ని ఒకేలా వండకూడదు. ఒక్కోదానికి వంట సమయం మారుతుంది.

వైట్​ రైస్​ త్వరగా ఉడికితే.. బ్రౌన్​ రైస్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనిబట్టి కుక్కర్​ వండుకునేప్పుడు చూసుకోవాలి.

అన్నం వండేప్పుడు స్టౌవ్​ని హైలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అన్నం సరిగా ఉడకదు.

అన్నం వండిన వెంటనే కాకుండా ఓ పది నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే మంచిది. (Images Source : Unsplash)