సమ్మర్​లో పుచ్చకాయను ఎక్కువమంది తింటారు. తియ్యగా ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు.

పుచ్చకాయ నోటికి రుచిగా ఉండడంతో పాటు.. మంచి పోషకాలతో నిండి ఉంటుంది.

సమ్మర్​లో హైడ్రేషన్​ని అందించడంతో పాటు హెల్తీ స్నాక్​గా ఆకలిని దూరం చేస్తుంది.

అయితే పుచ్చకాయ తిన్నప్పుడు కలిపి కొన్ని ఫుడ్స్ తినడం వల్ల దానిలోని పోషకాలు దూరమైపోతాయట.

కొందరు పుచ్చకాయను ముక్కలుగా కోసి.. దానిపై సాల్ట్ చల్లుకుని తింటారు. దానివల్ల రుచి పెరుగుతుంది.

కానీ ఇలా ఉప్పు చల్లి తినడం వల్ల పుచ్చకాయలోని పోషకాలు పోతాయి. కాబట్టి మీకు పోషకాలు కావాలనుకుంటే ఉప్పు వేసుకోకూడదు.

పుచ్చకాయ తింటున్నప్పుడు ఎగ్స్, ఇతర ఫ్రై చేసిన ఫుడ్స్ తినకపోవడమే మంచిది.

అలాగే పుచ్చకాయ తిన్నాక అరగంట వరకు కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు.

శరీరానికి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందాలనుకుంటే పుచ్చకాయను విడిగా తింటేనే మంచిది.

పుచ్చకాయను తినే విధానం, టైమ్​ని బట్టి పోషకాలు శరీరానికి అందుతాయి.