భోజనం రుచిని పెంచే ఊరగాయ.. ప్రతిరోజూ తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.



ఊరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి నూనె, ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు.



అధిక ఉప్పు అధిక రక్తపోటు రోగులకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది.



ప్రతిరోజు ఎక్కువ పరిమాణంలో ఊరగాయలు తినడం వల్ల శరీరంలో నీరు చేరి బరువు పెరిగే అవకాశం ఉంది.



కొన్ని పరిశోధనల ప్రకారం.. ఎక్కువ ఊరగాయలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కొన్ని క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరుగుతుంది.



పులిసిన ఊరగాయలలో ఉండే మంచి బాక్టీరియా (ప్రోబయోటిక్స్) జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.



ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండటానికి వారానికి 2-3 సార్లకు మించి ఊరగాయ తినకూడదు.



ఒకసారి ఒక స్పూన్ పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది.



మార్కెట్లో దొరికే వాటికి బదులుగా తక్కువ నూనె, ఉప్పుతో ఇంట్లో తయారుచేసిన ఊరగాయలను ఎంచుకోవడం మంచిది.



పిల్లలు, వృద్ధులకు జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది. కాబట్టి వారు తక్కువ తింటే మంచిది.