పిల్లలు ఇష్టంగా తింటున్నారని, లేదా ఈజీగా చేయొచ్చని మ్యాగీని ఎక్కువగా చేస్తారు.

పైగా పిల్లలు కూడా వీటిని కూడా తింటారు. అంతేకాకుండా ఇవి మంచి రుచిగా ఉంటాయి.

అయితే వీటిని పెద్దలైనా, పిల్లలైనా ఎక్కువగా తినవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని అంటారు. అందుకే దీనిని కంట్రోల్ చేయాలంటున్నారు.

న్యూడిల్స్​లో కార్బోహైడ్రేట్స్​ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివికాదు.

వీటిలోని రిఫైండ్ ఫ్లోర్​ రక్తంలో షుగర్ లెవల్స్​ని పెంచుతుంది. ఇది డయాబెటిస్​ రిస్క్​ని పెంచుతుంది.

న్యూడిల్స్​లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.

న్యూట్రిషన్​ విలువలు కూడా తక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి.

న్యూడిల్స్​లో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి బీపీ సమస్యను పెంచుతాయి.

వీటిలోని ఆర్టిఫిషియల్స్​ ఫ్లేవర్స్ ఆరోగ్య సమస్యలను పెంచుతాయని హెచ్చరిస్తున్నారు.

న్యూడిల్స్​, మ్యాగీకి బదులు హెల్తీ ఆప్షన్స్​ని తీసుకుంటే మంచిది. (Images Source : Pinterest)