ఆ సమస్యలుంటే కాళోంజి సీడ్స్ తినకూడదట ఆర్థ్రరైటిస్ సమస్యలున్నవారు కాళోంజి సీడ్స్‌ని తింటే మంచి ఫలితాలుంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం దూరంమవుతాయి. కాళోంజి సీడ్స్లోని యాంటీఆక్సిడెంట్లు కణాలు నాశనం కాకుండా హెల్ప్ చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ సీడ్స్‌ను రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవచ్చు. సీజనల్ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది. కాళోంజిలోని యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పలు వ్యాధులను దూరం చేస్తాయి. కాళోంజి సీడ్స్ కొందరిలో అలెర్జీ రియాక్షన్స్ ఇస్తాయి. కాబట్టి అలెర్జీలతో ఇబ్బందిపడేవారు తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ మందులు ఉపయోగించేవారు కూడా కాళోంజి సీడ్స్ తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఇవి కేవలం అవగాహన కోసమే నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.