తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయే అని అందరికీ తెలుసు.

సరిగ్గా వండాలే కానీ.. వంకాయ అంత రుచికరమైన కర్రీ ఏది ఉండదు అంటారు.

అయితే కొన్ని సమస్యలుంటే మాత్రం వంకాయ తినవద్దు అంటున్నారు.

మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే వంకాయలకు దూరంగా ఉండాలట.

కొందరికి వంకాయ తింటే అలెర్జీలు వస్తాయి. అలాంటివారు తినకపోవడమే మంచిది.

యాంగ్జైటీ, డిప్రెషన్​ ఉన్నవారు వంకాయ తినవద్దు అంటున్నారు.

రక్తహీనత ఉండేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలట.

కిడ్నీలో రాళ్లు ఉంటే మీరు వంకాయలు తినకపోవడమే మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pexels)