ఆ సమస్యలుంటే కొబ్బరి నీళ్లు తాగొద్దట సమ్మర్లో దాహార్తిని తీర్చుకునేందుకు కూల్‌డ్రింక్ తాగేస్తారు. అవి హెల్తీ కాదు అనేవారంతా కొబ్బరినీళ్లను ఆశ్రయిస్తారు. కొబ్బరి నీళ్లు దాహాన్ని తీర్చడమే కాకుండా.. హెల్త్‌కి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. సమ్మర్లో రెగ్యూలర్‌గా కొబ్బరి నీళ్లు తీసుకుంటే హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దీనిని తీసుకోకపోవడమే మంచిదిట. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది కాదట. అలెర్జీలతో ఇబ్బందిపడేవారు కూడా వీటిని తాగకపోవడమే మంచిది. ఇవి అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)