మధుమేహులు రోజూవారీ జీవితాల్లో తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు.

అవి చూసేందుకు చిన్నవిగానే ఉన్నా.. శరీరంలో షుగర్ లెవెల్స్​ను అమాంతం పెంచేస్తాయి.

జంక్ ఫుడ్స్, రిఫైండ్ కార్బ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, చక్కెర కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

దీర్ఘకాలం కూర్చొని పని చేయకుండా.. మధ్యలో లేచి నడుస్తూ ఉండాలి.

మైదా వంటి చక్కెర కలిగిన పదార్థాలు ఒబెసిటీ, డయాబెటిస్ లక్షణాలను పెంచుతాయి.

మధుమేహమున్నవారు ధూమపానం అస్సలు చేయకూడదు.

ఒత్తిడిని తగ్గించుకోకుండా మధుమేహం మీ కంట్రోల్​లో ఉండదు.

డయాబెటిస్ పేషింట్లు బ్రేక్​ఫాస్ట్​ను అస్సలు స్కిప్ చేయవద్దు అంటున్నారు నిపుణులు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)