ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే జుట్టు రాలే సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, జుట్టు రాలేందుకు చాలా కారణాలు ఉన్నాయి. కాస్మోటాలజీ, ట్రైకాలజీ స్టడీలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీనింగ్ టైమ్ కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా ఫోన్ కాల్స్ అతిగా మాట్లాడే వ్యక్తులకు జుట్టు రాలే సమస్యలు తప్పవట. ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని కాల్స్ మాట్లాడేప్పుడు జుట్టు రేడియేషన్‌కు గురవ్వుతుందట. అయితే, ఫోన్ మాట్లాడేవారికే కాదు.. ఫోన్ ఎక్కువ చూసినవారికి కూడా ఈ సమస్య తప్పదు. అతిగా ఫోన్‌కు చూసేవారు డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలు ఎదుర్కొంటారు. దానివల్ల జుట్టు రాలే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, ఫోన్‌ను తక్కువ వాడండి. ఈ విషయాన్ని ఫోన్‌కు అతుక్కుపోయే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. నోట్: పలు అధ్యయనాల్లో వివరాలను యథావిధి అందించామని గమనించగలరు.