చెరకు రసం ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉంటాయి.

అయితే ఈ చెరకు రసం తాగితే బరువు పెరుగుతారా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?

చెరకు రసంలో సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజమైన చక్కెరలు ఉంటాయి.

ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. డీహైడ్రేషన్​ని దూరం చేసి ఎనర్జిటిక్​గా ఉంచుతాయి.

ఓ గ్లాసులో అంటే 250 ml తాగితే దానిలో 130 నుంచి 150 కేలరీలు ఉంటాయి.

కాబట్టి దీనిని లిమిటెడ్​గా తీసుకుంటే మంచిది. కానీ ఎక్కువగా తీసుకుంటే కచ్చితంగా బరువు పెరుగుతారు.

ఈ చెరకు రసాన్ని బాగా వ్యాయామం చేసిన తర్వాత లేదా వేడి వాతావరణంలో తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

ఓ గ్లాసు రసాన్ని అకేషనల్​గా తీసుకుంటే మంచిది. దీనిలో షుగర్, సాల్ట్ వంటివి కలిపి తీసుకోకూడదు.

మీకు డయాబెటిస్, ఇన్సులిన్ ఇబ్బందులు, PCOS సమస్యలు ఉంటే తాగకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.