పచ్చిబఠానీ మొలకలు తింటే ఆ వ్యాధి రాదా? బఠానీ మొలకలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రమాదం నుంచి కాపాడుతాయి. డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పేగుకదలికలను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అంటువ్యాధులు, అనారోగ్యాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిబఠానీ మొలకలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో విటమిన్ కె ఉంటుంది. కాల్షియం శోషణకు సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది. విటమిన్ ఎ, సి కలయిక చర్మ పునరుత్పత్తి, కొల్లాజెన్ ఉత్పత్తి, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.