కాల్చిన చికెన్ తింటే క్యాన్సర్ వస్తుందా?

నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను చాలా ఇష్టపడతారు.

చికెన్ ను కర్రీ రూపంలో కొందరు, ఫ్రైలా మరికొందరు, కాల్చి ఇంకొందరు తింటారు.

నిప్పుల మీద కాల్చే చికెన్ తినడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

తందూరి లాంటి కాల్చిన చికెన్ ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలు పోతాయంటున్నారు.

కాల్చిన చికెన్ తినడం వల్ల పాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుందంటున్నారు.

చికెన్ ను కాల్చడం వల్ల మాంసం మీద క్యాన్సర్ కారకాలు ఏర్పడుతాయంటున్నారు.

చికెన్ ను కాల్చే సమయంలో ఏర్పడే పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌ ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

వీలైనంత వరకు కాల్చిన చికెన్ తినకపోవడం మంచిదంటున్నారు వైద్యులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com