ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే డయాబెటిస్ వస్తుందా? ఈ రోజుల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం కామన్ అయ్యింది. అయితే, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉపయోగించే BPA ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. లో ఇన్సులిన్ సెన్సిటివిటీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం అవుతంది. BPA కారణంగా టైప్ 2 డయాబెటిస్ కు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల పర్యావరణానికి కూడా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు, రాగి బాటిళ్లు వాడటం మంచిదంటున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com