ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే ఖాళీ కడుపుతో పండ్లజ్యూస్ తాగితే దాని ఆమ్లత్వం పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. జ్యూసులో ఉండే చక్కర రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. అంతేకాదు అలసట, ఆకలిని పెంచుతాయి. భోజనంతోపాటు లేదా తర్వాత జ్యూస్ తాగితే దానిలోని విటమిన్లు, ఖనిజాలు గ్రహించి పోషణను పెంచుతుంది. జ్యూసులో ఫైబర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులను నివారిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనంతోపాటు జ్యూస్ తాగితే చక్కెర నెమ్మదిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. భోజనంతోపాటు జ్యూస్ తాగితే వాల్యూమ్, రుచి పెరుగుతుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. పండ్ల జ్యూస్ ను సమతుల్య ఆహారంలో చేర్చితే పోషకాలన్నీ పొందవచ్చు. ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. ఖాళీ కడుపుతో పండ్ల జ్యూస్ తాగడానికి బదులు.. ఫైబర్, ఎనర్జీ కోసం పండ్లను తీసుకోవడం మంచిది. శక్తిని పెంచుకోవడానికి, రోజు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం బెటర్.