ఆవు పాలు పసుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా? బీటాకెరోటిన్ అనే వర్ణద్రవ్యం ఉండటంతో ఆవుపాలు పసుపు రంగులో కనిపిస్తాయి. బీటాకెరోటిన్ అనేది ఆవు ఆహారంలో భాగంగా తీసుకునే గడ్డి, మొక్కలలో కనిపించే సహజ సమ్మేళనం. ఆవులు గడ్డిని, తాజా పచ్చిగడ్డిని తిన్నప్పుడు బీటా కెరోటిన్ ను తీసుకుంటాయి. ఇవి పాలలో కలుస్తాయి. బీటా కెరోటిన్ అనేది పండ్లు, కూరగాయలలో కనిపించే వర్ణద్రవ్యం. నారింజ, ఎరుపు రంగులకు కారంణం ఇదు. ఆవు ఆహారం సీజన్ , జాతి వంటి అంశాలపై ఆధారపడి పసుపు రంగును మార్చుతుంది. పాశ్చరైజేషన్, హోమోజైనేషన్ వంటి పాల ప్రాసెసింగ్ పద్దతులు పాలరూపాన్ని ప్రభావితం చేస్తాయి. బీటా కెరోటిన్ విటమిన్ Aకి పూర్వగామి. మానవఆరోగ్యానికి అవసరమైన పోషకం ఇందులో ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.