స్నానం ఏ టైమ్ లో చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

స్నానం చేయడానికి కూడా ఓ టైం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

ఉదయంతో పోల్చితే, రాత్రి స్నానం చేయడం ఆరోగ్యానికి మరింత మంచిదంటున్నారు.

రోజంతా శరీరం మీద దుమ్ము, ధూళి పడి మురికిగా తయారవుతుంది.

చెమటతో అలాగే పడుకుంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల శరీరం మీద మురికి తొలగి చర్మం రీఫ్రెష్ అవుతుంది.

రాత్రిపూట స్నానంతో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి.

రాత్రిపూట స్నానం శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చక్కటి నిద్ర కలిగేలా చేస్తుంది.

వీలైతే ఉదయం, రాత్రి స్నానం చెయ్యడం మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com