డయాబెటిస్.. ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రధాన సమస్య. ఒక్కసారి మనిషికి షుగర్ వస్తే.. కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్ప.. వేరే దారి లేదు సరైన ఆహారం తీసుకోకపోతే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. షుగర్ ఉన్నవారు డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లు అసలు తినకూడదు.. అవేంటో ఇక్కడ చూద్దాం.. లీచీ పండ్లను మితంగానే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లలో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది. అరటిపండ్లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం మానేయండి. షుగర్ పేషెంట్స్ ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.