వెల్లుల్లిని ఇలా తీసుకుంటే పొట్ట ఈజీగా కరుగుతుంది! ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. అయితే, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వెల్లుల్లి ఎఫెక్టివ్‌గా కరిగిస్తుంది. వెల్లుల్లిలోని అలిసిన్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి గుజ్జును వేడి నీళ్లలో కలుపుకుని ఖాళీ కడుపుతో తాగితే కొవ్వు ఈజీగా కరువుతుంది. గోరు వెచ్చటి నీటిలో వెల్లుల్లి గుజ్జు, నిమ్మరసం కలిపి తాగితే కొలెస్ట్రాల్ మాయం అవుతుంది. గోరు వెచ్చటి నీటిలో వెల్లుల్లి రసం, తేనె కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో వెల్లుల్లి రసం కలిపి తాగితే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com