పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.

ఒక్కోపండులో ఒక్కోరకమైన సుగుణం ఉంటుంది. కనుక అన్నీ పండ్లు తినడం అవసరం.

కానీ వీటిని తినేందుకు కొన్ని చిన్నచిన్న రూల్స్ పాటిస్తే మరింత ఆరోగ్యం సొంతమవుతుంది.

పండ్లు ఆరోగ్యానికి మంచిది కదా అని రకరకాల పండ్లు ప్లేట్ నిండా వడ్డించుకుని తినకూడదు.

ఒకసారి ఒక రకమైన పండ్లు మాత్రమే తినాలి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని పండ్ల కాంబినేషన్ విరుద్ధంగా పనిచెయ్యవచ్చు.

పండ్లు ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచిది. లేదంటే మిడ్ మీల్ గా, స్నాక్ గా తినాలి. భోజనంతో కలిపి తినొద్దు.

ఏ పండైనా సరే నిమ్మళంగా నములుతూ రుచి ఆస్వాధిస్తూ తినాలి. దాని వల్ల అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

ఏ సీజన్ లో దొరికే పండును ఆ సీజన్ లో తప్పకుండా తినాలి.

పండ్ల ముక్కలను చేతితో తీసుకొని తినాలి. ఫోర్క్ లేదా టూత్ పిక్ తో తినొద్దు.

Image Source: Pexels

పండ్ హోల్ ఫ్రూట్ గా తినడం మంచిది. జ్యూస్ చేసుకుని తాగొద్దు.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసమే.