ఉప్పు తక్కువగా తీసుకుంటే కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా? రక్త నాళాల ద్వారా కణాలకు పోషకాలు, ఖనిజాలను తీసుకెళ్లడంలో సోడియం సాయపడుతుంది. బాడీకి కావాల్సిన సోడియం మనం తీసుకునే ఉప్పు ద్వారా లభిస్తుంది. శరీరంలో ఉప్పు తక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సోడియం లోపం కారణంగా నిరాశ, బలహీనత ఏర్పడుతుంది. కొన్నిసార్లు వికారం, వాంతులు, మలబద్ధకం ఏర్పడుతుంది. సోడియం తక్కువ కావడం వల్ల మూర్చతో పాటు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సోడియం లోపం కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సోడియం లోపం కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com