కాఫీ ఆరోగ్యానికి మంచిదే. స్ట్రెస్ దూరం చేయడమే కాకుండా అనేక రోగాల నుంచి కాపాడుతుంది.

అయితే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. కాఫీకి కూడా అది వర్తిస్తుంది.

మీకు ఎంత కాఫీ అలవాటున్నా సరే.. మితంగా తాగాలి. లేకపోతే కెఫిన్ ఇంటాక్సిఫికేషన్‌కు గురవ్వుతారు.

దీన్నే కెఫిన్ ఓవర్ డోస్ అని కూడా అంటారు. దానివల్ల ప్రాణాలు కూడా పోతాయి.

ఒక వ్యక్తి రోజుకు 400 mg మించి కాఫీ తాగరాదని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

ఒక రోజులో 1200 mg లేదా 12 కప్పుల కాఫీ తాగితే ప్రాణాలు పోతాయి.. లేదా మూర్ఛపోవచ్చు.

కాఫీ అతిగా తాగితే అతి మూత్ర సమస్యతో బాధపడతారు. పొటాషియం, ఇతర మినరల్స్ కోల్పోతారు.

పొటాషియం స్థాయిలు తగ్గితే (Hypokalemia) కండరాలు దెబ్బతిని పక్షవాతానికి గురవ్వుతారు.

శ్వాస వ్యవస్థలోని కండరాలు బలహీనం కావడం వల్ల ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడతారు.

చివరికి కిడ్నీలు కూడా పనికిరాకుండా పోతాయి. ఈ పరిస్థితి క్రమేనా మరణానికి దారితీయొచ్చు.

గమనిక: పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను యథావిధిగా అందించాం.