బ్రష్ చేస్తుంటే చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా?

బ్రష్ చేసేటప్పుడు చాలా మందిలో చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది.

నోటి అనారోగ్యానికి తొలి హెచ్చరికగా గుర్తించాలి.

బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి చిగుళ్లను డ్యామేజ్ చేస్తాయి.

చిగుళ్లు ఉబ్బి, ఎర్రగా మారి, చివరికి రక్తస్రావమవుతుంది.

చిగుళ్ల నుంచి రక్తం వచ్చే వాళ్లు సాఫ్ట్ బ్రష్ లను ఉపయోగించి దంతాలను శుభ్రపరుచుకోవాలి.

నిద్రలేవగానే, పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం మంచిది.

పొగ తాగే వారిలోనూ చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి. స్మోకింగ్ కు దూరంగా ఉండాలి.

డయాబెటిస్ పేషెంట్లలో నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com