కాఫీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? కెఫీన్ కు డయాబెటిస్ కంట్రోల్ కు లింక్ ఉందంటున్నారు నిపుణులు. రక్తంలో కెఫీన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారిలో టైప్2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందన్నారు. కెఫీన్ బరువును కూడా అదుపులో ఉంచుతున్నట్లు చెప్తున్నారు. బరువు తగ్గించే ఔషధాల్లోనూ కెఫీన్‌ను వినియోగిస్తుంటారు. కెఫీన్ ఎక్కువ కేలరీలను ఖర్చు చేయించి బరువు తగ్గిస్తుంది. బరువు తగ్గడం వల్ల డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగని కాఫీ మరీ ఎక్కువ తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు. మోతాదుకు మించి కాఫీ తాగితే గుండెదడ, చిరాకు, నిద్రలేమి, తలనొప్పి కలుగుతాయంటున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com