మెట్రో, రాపిడ్ రైల్, ట్రైన్ మధ్య తేడాలివే! ​

Published by: Jyotsna

మెట్రో, రాపిడ్ రైల్, ట్రైన్ మూడు రకాల రైల్వే రవాణా వ్యవస్థలు.

మెట్రో రైలు నగరాల్లో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ ఏరియాల్లో రవాణా సౌకర్యం కోసం

రాపిడ్ రైల్ నగరాల మధ్య వేగంగా ప్రయాణం చేయడానికి.

సాధారణ రైలు దేశవ్యాప్తంగా ప్రయాణికులను, సరుకులను రవాణా చేయడానికి.

మెట్రో రైలు వేగం గంటకు సగటున 60-80 కిమీ, కాగా రాపిడ్ రైల్ 120-160 కిమీ, సాధారణ రైలు సగటున 50-130 కిమీ వేగంతో నడుస్తుంది.

మెట్రో రైలు ట్రాక్ ప్రధానంగా ఎలివేటెడ్ , అండర్ గ్రౌండ్ లేదా నేల మీద ఉండచ్చు

రాపిడ్ రైల్ అలాగే సాధారణ రైలుకు విస్తృతమైన ట్రాక్‌లు, స్టేషన్లు, జాతీయ కనెక్టివిటీతో కలిగి ఉంటాయి.

మెట్రో రైళ్ళను నగర ప్రభుత్వాలు లేదా ప్రత్యేక సంస్థలు నిర్వహిస్తాయి.

రాపిడ్ రైల్ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిర్మిస్తే సాధారణ రైళ్ళను భారతీయ రైల్వే శాఖ నడిపిస్తుంది.