మీకు డయాబెటిస్ ఉన్నా.. డౌట్ ఉన్నా.. ఈ పండ్లు తినొద్దు, ఎందుకంటే?

డయాబెటిస్ వచ్చిందంటే జీవితం నరకమే. అనేక వ్యాధులు వెంటాడుతాయి.

అందుకే, తీపి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్స్ అస్సలు తినొద్దు.

అది సరే, పండ్లు మంచివేగా ఎందుకు తినొద్దు అంటున్నారనేగా మీ సందేహం?

మీకు తెలియని విషయం ఏమిటంటే.. పండ్లలో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది.

ఒక పెద్ద ఆరెంజ్ పండులో 17 గ్రాముల షుగర్ ఉంటుంది. ఒక 2, 3 తొనలు తినండి చాలు.

మామిడి పండులో సుమారు 46 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి కాయ మొత్తం తినొద్దు.

ఒక అరటి పండులో 15 గ్రాముల షుగర్ ఉంటుంది. బాగా మగ్గిన అరటి పండులో ఇంకా ఎక్కువ ఉంటుంది.

యాపిల్ మంచిదే. కానీ, అందులో 25 గ్రాముల షుగర్ ఉంటుంది. గ్రీన్ యాపిల్ అయితే ఒకే.

ఒక కప్పు ద్రాక్షలో 25 గ్రాముల షుగర్ ఉంటుంది. వీటిని కూడా తక్కువ తింటే బెటర్.

ఒక కప్పు చెర్రీస్‌లో 19 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి, వాటిని కూడా కొద్దిగానే తీసుకోవాలి.