ఈ విటమిన్ లోపిస్తే గాఢ నిద్రలోకి జారుకుంటారని తెలుసా!

Published by: Madhavi Vennela
Image Source: pexels

మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొన్నిసార్లు మనకు నిద్రపట్టదు, కొన్ని సార్లు ఎక్కువగా నిద్రపోతాం

ఎక్కువ నిద్ర కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. శరీరంలో విటమిన్లు లోపిస్తే ఇలా జరుగుతుందని మీకు తెలుసా.

ఏ విటమిన్ లోపిస్తే మనం ఎక్కువగా నిద్రపోతామో ఇప్పుడు తెలుసుకుందాం

విటమిన్ డి లోపిస్తే అధిక నిద్ర వస్తుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారి డిప్రెషన్ కు గురవుతారు.

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు సూర్యరశ్మికి ఉండాలి. దాంతో లోపాన్ని జయించవచ్చు

ఇదే కాకుండా గుడ్లు, పాలు , చిరుధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ బి12లోపం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో గాఢ నిద్ర వస్తుంది.

ఈ విటమిన్ లోపాన్ని అధిగమించేందుకు బచ్చలికూర, పుట్టగొడుగులు, బీట్రూట్, అరటిపండు, చేపలు తినాలి.

విటమిన్ ఈ లోపం కూడా అధిక నిద్రకు కారణమవుతుంది. విటమిన్ బి6 లోపిస్తే కూడా అధిక నిద్ర వస్తుంది.

చేపలు, పాలు, మాంసం, నారింజ, స్ట్రాబెర్రి, అరటి, కివి, దానిమ్మను తీసుకుంటే బి6 అందుతుంది.

Image Source: pexels