బాలీవుడ్ హాట్ కపుల్ లిస్ట్​లో దీపిక, రణ్​వీర్​ కచ్చితంగా ఉంటారు.

వీరిద్దరూ కలిసి పద్మావత్, రామ్ లీల, బాజీరావు మస్తానీ వంటి హిట్ సినిమాలు చేశారు.

పద్మావత్ తర్వాత వీరిద్దరూ 2018లో వివాహంతో ఒక్కటయ్యారు.

అప్పటినుంచి కెరీర్​పై మరింత దృష్టి పెట్టి ప్రాజెక్టులు చేశారు.

పెళ్లి అయిన ఆరేళ్ల తర్వాత వీరు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు వెల్లడించారు.

పెళ్లి సమయానికి దీపిక వయసు 32 కాగా.. ప్రస్తుతం ఆమె వయసు 38.

రణ్​వీర్ ఈ సంవత్సరం 39వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాడు.

సెప్టెంబర్, 2024కి తమ మొదటి బేబిని పొందనున్నట్లు తెలిపారు. (Images Source : Instagram/deepikapadukone)