నల్లవెల్లుల్లిలో ఔషధ గుణాలెన్నో బ్లాక్ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కంటే అధిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. తాజా వెల్లులితో పోలిస్తే నల్లువెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కంట్రోల్ చేస్తాయి. నల్లవెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవెల్స్, రక్తపోటును తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. గట్ ఆరోగ్యానికి కాపాడుతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.