ఐబుప్రొఫెన్ (IBUPROFEN)ను నొప్పి నివారణిగా వాడుతుంటారు. ఆన్ కౌంటర్ కూడా సులభంగానే దొరుకుతుంది.

పెయిన్ కిల్లర్ అదే పనిగా తీసుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని చెబుతున్నాయి.

పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేవారిలో జీర్ణవ్యవస్థలో శ్లేష్మ పొర తయారీలో అవాంతరాలు ఏర్పడతాయి.

ఫలితంగా కడుపులో ఉత్పతి అయ్యే ఆమ్లాల వల్ల అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఈ పెయిన్ కిల్లర్లు నెలల తరబడి తీసుకునే పురుషుల్లో సంతానసాఫల్య సమస్యలను కూడా గమనించారట.

వారానికి రెండు సార్లు పెయిన్ కిల్లర్లు తీసుకున్న స్త్రీలలో వినికిడి లోపాన్ని గుర్తించినట్లు ఒక అధ్యయనం తెలుపుతోంది.

లోపలి చెవి లోని కొక్లియార్ కు రక్త ప్రసరణ సమస్యలు రావడం వల్ల వినికిడి లోపం వస్తుందట.

ఐబుప్రొఫెన్ ఎక్కువగా వాడే వారిలో 31 శాతం వరకు కార్డియాక్ అరెస్ట్ జరిగే ప్రమాదం ఉంటుందట.

ఐబుప్రొఫెన్ తో పాటు గర్భనిరోధకాల వంటి హార్మోనల్ మందులు తీసుకుంటే బ్లడ్ క్లాట్ ప్రమాదం ఉంటుందట.

హార్మోనల్ టాబ్లెట్లతో కలిపి పెయిన్ కిల్లర్ తీసుకున్నపుడు త్రాంబోఎంబోలిజం ప్రమాదం ఐదు రెట్లు పెరుగుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.