రోజూ పనీర్ తింటే ఏమవుతుంది? మంచిదా? కాదా?

Published by: Geddam Vijaya Madhuri

పనీర్ ప్రోటీన్కు చాలా మంచి ఆధారం. నాన్ వెజ్ తినని వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

పనీర్ చాలా సులభంగా జీర్ణమవుతుంది. పనీర్లో ఉండే ప్రోటీన్ చాలా సులభంగా శరీరంలో కరిగిపోతుంది.

అలాగే ఇది శరీరం నుంచి సులభంగా బయటకు పోదు. కాబట్టి చాలాసేపు కడుపు నిండిన ఫీల్ ఉంటుంది.

పనీర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పనీర్ శరీరంలోని కండరాలు, ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇది శరీర జీవక్రియను పెంచుతుంది.

పనీర్లో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇది శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

పనీర్ కాల్షియంకి మంచి ఆధారం. ఇది శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పనీర్ హృదయానికి కూడా మంచిది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పనీర్ తినవచ్చు.

క్రీమ్ వాడకాన్ని తగ్గించడానికి పనీర్ను మెత్తగా చేసి ఉపయోగించవచ్చు.