బియ్యం నానబెట్టకుండా వండుతున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

బియ్యంలో సహజంగా 'ఫైటిక్ యాసిడ్' ఉంటుంది. ఇది జింక్, ఐరన్, కాల్షియం శోషణను నిరోధిస్తుంది.

బియ్యం నానబెట్టడం వల్ల ఈ ఆమ్లం విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల శరీరం ఖనిజాల పూర్తి పోషణను సులభంగా పొందుతుంది.

వీటిని నీటిలో నానబెట్టడం వల్ల బియ్యంలో ఉండే పురుగుమందులు, 'ఆర్సెనిక్' (విషపూరిత లోహం) తొలగిపోతాయి.

నానబెట్టే ప్రక్రియ వల్ల బియ్యం 'ప్రీ డైజెస్ట్' అవుతాయి. దీనివల్ల అవి జీర్ణం చేసుకోవడానికి చాలా తేలికగా ఉంటాయి.

ఆహారంలో తేలికగా ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపులో గ్యాస్, బరువు లేదా అజీర్ణం వంటి సమస్యలు ఉండవు.

అదనపు స్టార్చ్ నీటిలో కరిగిపోవడం వల్ల వండిన తర్వాత బియ్యం జిగటగా మారకుండా పొడిపొడిగా తయారవుతాయి.

ధాన్యం లోపలి వరకు హైడ్రేట్ అవ్వడం వల్ల బియ్యం త్వరగా ఉడుకుతాయి. తద్వారా సమయం, గ్యాస్ (ఇంధనం) ఆదా అవుతుంది.

ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం నానబెట్టి వండిన బియ్యం జీర్ణవ్యవస్థ, ప్రేగుల ఆరోగ్యానికి ఉత్తమమైనవి.

పోషణను కాపాడుకోవడానికి బ్రౌన్ రైస్ ను 6 నుంచి 8 గంటలు, బాస్మతిని కనీసం అరగంట నానబెట్టాలి.