కోపం రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే దానిని కంట్రోల్ చేసుకోకపోతే అనేక అనర్థాలు వస్తాయి.

కోపం వచ్చినప్పుడు కలిగే ఉద్రిక్తత, హార్ట్ రేట్, పిడికిలి బిగించడం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి.

మీరు కోపాన్ని కంట్రోల్ చేయడం కంటే.. మీకు కోపం వస్తుందనేది గుర్తిస్తే చాలు. ఆటోమెటిక్​గా కోపం తగ్గుతుంది.

కోపాన్ని ప్రేరేపించే పరిస్థితులు, వ్యక్తులకు దూరంగా ఉండండి. టైమ్ తీసుకోండి.

డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల మీ నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. దీనివల్ల కోపం తగ్గుతుంది.

శారీరక శ్రమ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్​గా వ్యాయామం చేయండి.

ఫోర్స్​గా కాకుండా సమర్థవంతంగా మీ సమస్యను కమ్యూనికేట్ చేయండి.

మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోండి. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.

కోపంలో ఉన్నప్పుడు ఇతరులను మాట అనకుండా, వారిని గాయపరచకుండా, సెల్ఫ్ హార్మ్ చేసుకోకుండా ఉంటే మంచిది.

కోపంలో ఉన్నప్పుడు ఓ గ్లాస్ నీరు తాగడం లేదా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వస్తుంది.