గురక పెడితే అబ్బా మంచి నిద్ర పట్టింది ఈరోజు అనుకుంటారు.

కానీ గురక అనేది అనారోగ్యాలకు సంకేతమని గుర్తించరు.

పైగా ఈ గురక మీకే కాకుండా మీ పక్కనున్నవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

కాబట్టి దీనిని కంట్రోల్ చేసుకోవాల్సి బాధ్యత ఎంతైనా ఉంది.

మీకు పక్కకు తిరగకుండా వెల్లకిల్లా పడుకునే అలవాటు ఉందా?

వెంటనే పొజీషన్ మార్చి పక్కకి తిరిగి పడుకోవడం వల్ల కాస్త కంట్రోల్ అవుతుంది.

బరువు పెరగడం వల్ల కూడా గురక వచ్చే ప్రమాదముంది కాబట్టి బరువు తగ్గండి.

నిద్రకు నాలుగు గంటల ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకండి.

సరైన నిద్ర లేకుంటే కూడా గురక వస్తుంది. కనీసం 8 గంటలు పడుకోండి. (Images Source : Unsplash)