బ్రష్ చేసేప్పుడు కొందరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తారు. దానివల్ల పంటి సమస్యలు వస్తాయి.

పళ్లు తోముకునేప్పుడు కచ్చితంగా రెండు నిముషాలైనా బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

బ్రష్​ని ముందుకు, వెనక్కి కాకుండా రౌండ్​గా, సర్క్యులర్​ మోషన్​లో గుండ్రంగా తిప్పుతూ బ్రష్ చేయాలి.

ఇష్టమొచ్చినట్టు తోమితే పంటిపై ఉండే ఎనామిల్ లేయర్ పోతుంది. గమ్ సమస్యలు పెరుగుతాయి.

పంటికి ముందు, వెనుక, పై భాగంలో, లోపలి భాగంలో కూడా బ్రష్ చేయాలి.

గట్టిగా ఉండే బ్రిజెల్స్ మంచివి కాదు. ఇవి ఎనామిల్​ని పాడు చేస్తాయి. స్మూత్​గా ఉండే బ్రష్​లు మంచిది.

మూడు, నాలుగు నెలలకోసారి బ్రష్​ని మారుస్తూ ఉంటే పంటి ఆరోగ్యానికి మంచిది.

నాలుకను కూడా బ్రష్ చేయాలి. టంగ్ క్లీన్ చేసుకోవడానికి ఇదొక మంచి మార్గం కూడా.

రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తే పళ్లు స్ట్రాంగ్​గా ఉంటాయి. పిప్పళ్లను దూరం చేసుకోవచ్చు.

ప్రతి ఆర్నెళ్లకోసారి వైద్యులను సంప్రదిస్తూ పరీక్షలు చేయించుకుంటే మరీ మంచిది.