పళ్లు తోముతూ డే ప్రారంభమవుతుంది. అయితే మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మిస్టేక్స్ చేయొద్దు.

కంఫర్ట్​బుల్​గా, సాఫ్ట్​గా ఉండే బ్రెస్టిల్స్ ఉన్న టూత్​బ్రష్​ని ఉపయోగిస్తే మంచిది.

కనీసం రెండు నిమిషాలు పళ్లలోని అన్నిభాగాలను క్లీన్ చేస్తూ బ్రష్ చేయాలి.

పళ్లను ఎప్పుడూ గట్టిగా తోమకూడదు. దీనివల్ల పళ్లు డ్యామేజ్ అవుతాయి. ఎనిమెల్ పొర ఊడిపోతుంది.

గట్టిగా కాకుండా జెంటిల్​గా సర్క్యూలర్​ మోషన్​లో బ్రష్ చేయడం పంటి ఆరోగ్యానికి ఉత్తమం.

మెరిసే దంతాలు మీ సొంతం కావాలంటే.. ముందు, వెనుక, పై భాగంలో పళ్లను క్లీన్ చేయాల్సి ఉంటుంది.

కనీసం 3, 4 నెలలకోసారి టూత్​ బ్రష్​ను మారుస్తూ ఉండాలి. బ్రిస్టెల్స్ పాడైనా కూడా మార్చేయాలి.

ఉదయం సాయంత్రం కచ్చితంగా బ్రష్ చేయాలి. కుదిరితే ప్రతి మీల్ తర్వాత బ్రష్ చేయండి.

మంచి టూత్​పేస్ట్​ని ఎంచుకోవాలి. ఫ్రోరైడ్ ఉండే టూత్​పేస్ట్ గమ్స్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

మీ బ్రష్​తో నాలుకను.. నాలుక పైభాగాన్ని కూడా స్మూత్​గా బ్రష్ చేసి క్లీన్ చేసుకోవాలి.