కొబ్బరి నీళ్లు సమ్మర్​లో తాగితే చాలా లాభాలుంటాయంటున్నారు. హైడ్రేషన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ కూడా.

శరీరం కోల్పోయిన పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్​ను శరీరానికి అందించి హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.

సమ్మర్​లో దాహాన్ని తీర్చుకోవడానికి ఫ్లూయిడ్స్​తో నిండిన కొబ్బరి నీళ్లు తీసుకుంటే మంచిది.

కొబ్బరి నీళ్లలో షుగర్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. అలసటను దూరం చేస్తాయి.

వీటిలో ఫైబర్, ఎలక్ట్రోలైట్స్ జీర్ణక్రియను మెరుగ్గా చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

కొబ్బరి నీళ్లల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

మజిల్ క్రాంప్స్​ని దూరం చేస్తుంది. స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.

పుచ్చకాయ, కీరదోస, సెలరీ వంటివాటితో కలిపి తీసుకుంటే బాడీ హీట్​ని తగ్గించుకోవచ్చు.

కొబ్బరి నీళ్లు తాగేప్పుడు ఫ్రెష్​వి తీసుకుంటేనే మంచిది. బాటిల్స్​లో లేదా ప్యాక్ చేసిన వాటికి దూరంగా ఉండాలి.

ఎక్కువగా తాగితే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి.