స్కిన్​కి మంచి మాయిశ్చరైజర్​ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్​లో ఎలాంటి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలో తెలుసా?

వేసవిలో జిడ్డును పెంచకుండా చర్మానికి హైడ్రేషన్​ని అందించే మాయిశ్చరైజర్​ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

జోజోబా, బాదం, గ్రేప్ సీడ్ వంటి తేలికైన ఆయిల్స్ ఉండే మాయిశ్చరైజర్స్ మంచివి.

హైల్యూరోనిక్ యాసిడ్, గ్లిసరిన్, సెరామైడ్స్ వంటివి హైడ్రేషన్​ని అందించి ఎక్కువసేపు మాయిశ్చరైజ్ చేస్తాయి.

విటమిన్ సి, విటమిన్ ఈ, ఫెర్యూలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటే స్కిన్​ హెల్త్​కి మంచిది. UV కిరణాల నుంచి రక్షిస్తాయి.

అలోవెరా, చమోలీ, గ్రీన్ టీ స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. ఈ పదార్థాలు ఉండే మాయిశ్చరైజర్స్ మంచివే.

వాటర్ బేస్డ్, తేలికైన, నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్స్ సమ్మర్​లో మంచి ఫలితాలు ఇస్తాయి.

ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్​ని ఉపయోగిస్తే బెటర్.

సీరమ్ మాయిశ్చరైజర్స్ కూడా మంచివి. ఇవి శరీరంలోకి త్వరగా అబ్జార్వ్ అవుతాయి.