సీరియల్ ఆరిస్టులు పవిత్ర జయరాం, చంద్రకాంత్ నటులు కాకముందు ఏమి చేసేవారో తెలుసా? పవిత్ర నటి కాకముందు.. భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలను పెంచేందుకు పలు పనులు చేశారట. హౌస్ కీపింగ్‌గా, గార్మెంట్స్ షాప్‌లో, నర్సింగ్ కాలేజ్‌లో లైబ్రేరియన్‌గా చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తర్వాత డైరక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్లినట్లు పవిత్ర తెలిపింది. నటుడు చంద్రకాంత్ కూడా మొదట్లో నటుడు కావాలని అనుకోలేదట. సీరియల్స్‌కి రాకముందు ఫుట్‌బాల్ ప్లేయర్‌గా స్టేట్లెవెల్లో ఆడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చందుని జిమ్‌లో చూసిన ఓ ప్రొడ్యూసర్ అతనికి నటుడిగా అవకాశమిచ్చినట్లు తెలిపారు. చందు, పవిత్ర జయరామ్ త్రినయని సీరియల్స్‌లో బ్రదర్-సిస్టర్‌గా నటించారు. సీరియల్స్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.