సెలరీ చూసేందుకు కొత్తిమీరలాగానే ఉంటుంది. కానీ దీనిని డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

సెలరీలోని నీటిశాతం, ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి హెల్త్​కి మంచిది.

సెలరీలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది హైడ్రేషన్​ని అందించి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరి లక్షణాలు ఆర్థ్రరైటిస్ వంటి లక్షణాలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

సెలరీలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ ప్రమదాన్ని దూరం చేస్తాయి.

కేలరీలు తక్కువగా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది.

యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. మానసికంగా రిలాక్స్ చేస్తుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది.

సెలరీలో విటమిన్ కె, సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి బోన్ హెల్త్​కి మంచివి.

విటమిన్ సి, బెటా కెరోటిన్ స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్​ నుంచి రక్షిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.