వాష్ రూమ్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? అయితే, జాగ్రత్త!

ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకం అనేది వ్యసనంగా మారిపోయింది.

చాలా మంది వాష్ రూమ్ కు వెళ్లినా సెల్ ఫోన్ ను తీసుకెళ్తున్నారు.

బాత్ రూమ్ లో ఫోన్ చూస్తు గంటలు గంటలు గడుపుతున్నారు.

రెస్ట్ రూమ్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

టాయిలెట్ లో ఫోన్ వాడడం వల్ల బోలెడు రోగాలు వస్తాయంటున్నారు.

టాయిలెట్ లోని ప్రమాదకర వైరస్ లు సెల్ ఫోన్ మీదికి చేరి శరీరంలోకి వెళ్తాయంటున్నారు.

డయేరియా, పేగు, మూత్ర సంబంధ వ్యాధులతో పాటు అంటు వ్యాధులు సోకుతాయంటున్నారు.

వాష్ రూమ్ లో కమోడ్ మీద చాలా సేపు కూర్చుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com