మల్లెపూలతో తలనొప్పికి చెక్ పెట్టొచ్చా? మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు మందులా పని చేస్తాయి. తాజా మల్లెల్ని మెత్తగా నూరి తడిగుడ్డలో చుట్టి కళ్లపై పెట్టుకుంటే పలు కంటి సమస్యలు తగ్గిపోతాయి. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే అందంగా తయారవుతుంది. తలనొప్పిగా ఉంటే కాసేపు మల్లెపూల వాసన చూస్తే సమస్య మాయం అవుతుంది. కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి కాచి వడకట్టి జుట్టుకు రాస్తే కురులు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు మంటగా ఉన్నా, కంట్లో నొప్పిగా ఉన్నా మల్లెల కషాయం దివ్యఔషధంలా పని చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు మల్లెపూల ఛాయ్ తాగితే రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ముఖానికి మల్లెపూల గుజ్జుతో ఫేస్ ప్యాక్ చేస్తే నిగనిగలాడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com