అరటి పండులో పొటాషియం ఎక్కువ కనుక గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటి పండు బీపీని కూడా అదుపు చేస్తుంది. తక్షణ శక్తి కావాలంటే ఒక అరటి పండు తింటే సరిపోతుంది. అరటి పండులో విటమిన్లు C, B6, ఫోలేట్ ఉంటుంది. కనుక నిరోధక శక్తి పెరుగుతుంది. అరటి పండులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అరటి పండుతో సెరోటోనిన్ పెరుగుతుంది. కనుక డిప్రెషన్ తగ్గిస్తుంది. అసిడిటితో బాధపడే వారు అరటి పండు తింటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అజీర్తి, రిఫ్లక్స్ నుంచి విముక్తి లభిస్తుంది. అరటి పండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.