ఓ స్టడీ ప్రకారం ముద్దు పెట్టుకున్నప్పుడు 80 మిలియన్ల బ్యాక్టీరియా ఎక్స్ఛేంజ్ అవుతుందట. ఇదేదో నష్టం కలిగిస్తుంది అనుకుంటున్నారేమో. కానే కాదు ఇది మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో ముద్దు బాగా హెల్ప్ చేస్తుందని ఓ స్టడీ తెలిపింది. ముద్దు పెట్టుకోవడం వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్ విడుదలై.. స్ట్రెస్ తగ్గుతుంది. జర్మన్లో చేసిన ఓ స్టడీ ప్రకారం.. ముద్దు మగవారి ఆయుష్షును పెంచుతుందట. పార్టనర్‌ని రోజులో ఓసారి కిస్ చేసినా.. జీవితకాలంలో 5 ఏళ్లు పెరుగుతాయని తెలిపింది. ఇమ్యూనిటీని పెంచుకోవడంలో కూడా ముద్దు ముఖ్యపాత్ర పోషిస్తుందట. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)