అరటి ఆకులను తినొచ్చా? డయాబెటిక్ రోగులు తింటే ఏమవుతుంది?

అరటిని ఔషదాల గని అంటారు. అరటి పండు, కాయ, పువ్వు ప్రతి ఒక్కటీ ఆరోగ్యకరమే.

వాటిని పచ్చిగా లేదా కూరలుగా చేసుకుని తినొచ్చు. కానీ, ఆకులు తినొచ్చా?

కొన్ని ఆయుర్వేద చికిత్సల్లో అరటి ఆకులను ఉపయోగిస్తారు. వాటిని జ్యూస్‌గా చేసి ఇస్తుంటారు.

తాజా అరటి ఆకులో పోలీఫెనాల్స్ ఉంటాయట. అవి క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయట.

గాయాలు, దురదలకు కూడా అరటి ఆకును వాడతారు. ఉదయాన్నే ఈ ఆకు రసం తాగితే జలుబు, దగ్గు రావట.

అరటి ఆకులు డయాబెటిస్ రోగులకు కూడా మంచివేనట. షుగర్ స్థాయిలు తగ్గిస్తాయట.

అయితే, జంతువులపై చేసిన ప్రయోగాల్లో మాత్రమే ఈ విషయం తెలిసింది. మనుషులపై ప్రయోగాలు చేయలేదు.

కాబట్టి, వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా వీటిని ఆహారంగా తీసుకోవద్దు.

అయితే, మన పూర్వికుల్లా అరటి ఆకుల్లో ఆహారం తీసుకుంటే.. అందులోని ప్రయోజనాలన్నీ లభిస్తాయి.