చాలామంది స్కిన్ హెల్తీగా ఉండేందుకు ఐస్ క్యూబ్‌ని అప్లై చేస్తారు. మరి ఐస్ క్యూబ్‌ని సమ్మర్లో ముఖానికి అప్లై చేయొచ్చా? మంచిదేనా? ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐస్ క్యూబ్‌ని ఫేస్‌కి అప్లై చేయొచ్చు అంటున్నారు. ముఖం ఉబ్బినా.. కళ్లు ఉబ్బినా.. ఐస్ క్యూబ్ మసాజ్ చేస్తే నార్మల్ అవుతాయి. రక్తప్రసరణ పెరిగి ఫేస్ నిగారింపును సంతరించుకుంటుంది. ముఖ్యంగా సమ్మర్లో స్కిన్ వేడికి కందిపోతే.. దానిని నుంచి ఇది ఉపశమనం అదిస్తుంది. ముఖంపై ఉన్న జిడ్డును పోగొట్టి.. ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. మేఖప్ వేసుకునే ముందు ఐస్ క్యూబ్ అప్లై చేస్తే మీ లుక్ సూపర్ పర్ఫెక్ట్ ఉంటుంది. గమనిక : నిపుణుల సలహా తర్వాతే మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. (Images Source : Unsplash)