ఇవి తీసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత కూడా హైట్ పెరగొచ్చా?

హైట్‌గా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అది ప్రతి ఒక్కరి కల.

టీనేజ్ దాటిపోయిన తర్వాత హైట్ పెరగడం అనేది కలగానే మిగిలిపోతుంది.

ముఖ్యంగా వయస్సు 20 ఏళ్లు దాటిన తర్వాత హైట్ పెరగడం కష్టమే.

అయితే, విటమిన్-D సప్లిమెంట్స్ తీసుకుంటే హైట్ పెరుగుతారని అపోహ ఉంది.

వాస్తవానికి టీనేజ్ ముగిసిన తర్వాత ‘విటమిన్-D’ ప్రభావం ఉండదు.

కానీ, టీనేజ్‌లో ఉన్నప్పుడు విటమిన్-డి సక్రమంగా అందితే తప్పకుండా ఎత్తు పెరగవచ్చు.

టీనేజ్‌లో విటమిన్-డి వల్ల ఎముకలు నిలువుగా పెరుగుతాయి. కాబట్టి, ఎత్తు పెరగడం సాధ్యం.

కొందరిలో జీన్స్ వల్ల ఎత్తు పెరగలేరు. వారిపై ‘విటమిన్-D’ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.

గమనిక: డాక్టర్ సూచనల తర్వాతే సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం అవగాహనకే.