వామ్మో, ఇలా నవ్వితే చనిపోతారా? ఈ లక్షణాలతో జాగ్రత్త! నవ్వడం వల్ల ఎన్నో్ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అయితే, కొన్ని అధ్యయనాలు మాత్రం ‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అని అంటున్నాయి. ముఖ్యంగా నవ్వు వల్ల ప్రాణాలు పోవడమే కాదు, అనారోగ్య సమస్యలు కూడా రావచ్చుట. మీకు గట్టిగా.. ఆపుకోలేనంతగా నవ్వు వస్తున్నట్లయితే ప్రమాదంలో పడినట్లే. గట్టిగా నవ్వడం వల్ల మెదడు రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా పగిలిపోతాయి. దానివల్ల మెదడులో రక్తస్రావం జరుగుతుంది. ఈ పరిస్థితి మరణానికి దారితీయొచ్చు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని బ్రెయిన్ అనూరిజం అని అంటారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్ల కోమాలోకి వెళ్లొచ్చు లేదా చనిపోవచ్చు. అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు, చూపు మసకబారడం వంటివి ప్రధాన లక్షణాలు. కొందరు గందరగోళానికి గురికావడం లేదా మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంది. నోట్: పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను యథావిధిగా అందించామని గమనించగలరు.