చేపలు తింటే గుండె జబ్బులు తగ్గుతాయా? చేపలలో ఆరోగ్యానికి మేలు చేసే బోలెడు పోషకాలుంటాయి. చేపల్లో EPA, DHA లాంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. EPA, DHAను మన బాడీ తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే తీసుకోవాలి. EPA, DHA గుండెతో పాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచుగా చేపలు తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందంటున్నారు నిపుణులు. చేపల్లోని ఫ్యాటీ యాసిడ్స్ గుండె సమస్యలను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. వంశ పారంపర్యంగా గుండె జబ్బులు వచ్చే వాళ్లు చేపలు తినడం వల్ల మేలు కలుగుతుంది. చేపలు తినడం వల్ల గుండె జబ్బులతో పాటు పక్షవాతం వంటి జబ్బులు దూరం అవుతాయి, నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com