బ్రెయిన్ హెల్త్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల అది డ్యామేజ్ అవుతుంది.

సరైన నిద్ర లేకుంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మతిమరుపునకు దారితీస్తాయి.

శరీరానికి, మెదడుకు సరైన పోషకాలు అందించకుంటే బ్రెయిన్ హెల్త్ కరాబ్ అవుతుంది. ఒమేగా ఫ్యాటీ 3 ఫుడ్స్ మంచివి.

డీహైడ్రేషన్ కూడా మెదడు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మతిమరుపు లక్షణాలు పెంచుతుంది.

క్రిమీసంహారక మందులు వినియోగం ఎక్కువగా ఉన్నా అది న్యూరో సమస్యలను పెంచుతుంది.

మద్యం, స్మోకింగ్ రెండూ కూడా మెదడులోని కణాలను డ్యామేజ్ చేస్తాయి. అనేక సమస్యలను తెస్తాయి.

ఫిజికల్ యాక్టివిటీ చేయనివారిలో కూడా ఈ తరహా న్యూరో సమస్యలు వస్తూ ఉంటాయి.

మధుమేహం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు కూడా మెదడును నెగిటివ్​గా ప్రభావితం చేస్తాయి.

పలురకాల ఇన్​ఫెక్షన్లు, హెవీ మెటల్స్, ఎయిర్ పొల్యూషన్ ఇలా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారకాలు ఎన్నో ఉన్నాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలతో బ్రెయిన్​ హెల్త్​ని ప్రమోట్ చేసుకోవచ్చు.